ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కొత్త నేర చట్టాలను సరించాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం.
కొత్త నేర చట్టాల సవరణ చేయాల్సిన ఆవశ్యకత వుందని లేని పక్షాన ప్రజలు ఇబ్బంది పడతారు అని దిలీపు చౌదరి తాళ్లురీ మరియు ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరళ్ల శ్రీనివాస్ రావు కేంద్ర హోం సహాయక శాఖా మంత్రికి వివరించారు. నేర చట్టాలతో పాటు సెంట్రల్ నోటరీ పబ్లిక్ అపాయింట్మెంట్స్ , అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుని కూడా ప్రవేశ పెట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ ,సంక్రాంతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.