Details

న్యాయవాద రక్షణ చట్టం బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు వినతి పత్రం

న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు తాళ్లూరి దిలీప్, కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు వినతి పత్రం సమర్పించారు. గురువారం ఢిల్లీలో వారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కలిసి న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, రక్షణ చట్టం ఆవశ్యకత గురించి వివరించగా వెంటనే స్పందించిన ఆయన.. కేంద్రమంత్రి కిరణ్ రిజుజుతో మాట్లాడి సమస్యను వివరించారు. అనంతరం రవిచంద్ర సమక్షంలో కేంద్రమంత్రి నివాసానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కిరణ్ రిజుజు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. న్యాయవాద రక్షణ చట్టం బిల్లుపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీసుకున్న చొరవ పట్ల న్యాయవాదులు దిలీప్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.