Details

న్యాయవాద రక్షణ చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కృషి చేయాలని ఎంపీ నామాను కోరిన తాళ్లూరి దిలీప్

న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కృషి చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావును ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ కోరారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో నామాను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేలా కృషి చేస్తామన్నారు. ఈ విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.