న్యాయవాద రక్షణ చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరిన తాళ్లూరి దిలీప్
న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కృషి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.