యువ న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కేటీర్ కి వినతిపత్రం అందజేసిన brs లీగల్ న్యాయవాదులు.
- 2019 తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్న వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలి.
- స్టేట్ నోటరీ నోటిఫికేషన్ జారీ చేయాలి. - 2006 తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్న 35 ఏళ్లు దాటిన వారికి వెల్ఫేర్ ఫండ్ వర్తింప చేయాలి. - అసెంబ్లీలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ పై చట్టం చేయాలి. - బార్ కౌన్సిల్ ఇస్తున్న రూ.4 లక్షలకు ప్రభుత్వం మరో రూ.4 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. - తాళ్లూరి దిలీప్ చౌదరి మరియు బిచ్చల తిరుమల రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి వినతి పత్రం సమర్పణ.2019 తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్న యువ న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే 2లక్షల భీమని 5 లక్షలు చెయ్యాలని కేటీర్ గారికి సోమవారం తాళ్లూరి దిలీప్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలు న్యాయవాద సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2014 తర్వాత ఇప్పటి వరకు స్టేట్ నోటరీ నోటిఫికేషన్ జారీ చేయలేదని, వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. 2006 తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్న 35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ వర్తించే విధంగా చట్ట సవరణ చేయడంతోపాటు బార్ కౌన్సిల్ ఇస్తున్న రూ.4 లక్షల డెత్ బెనిఫిట్ కు ప్రభుత్వం మరో రూ.4 లక్షలను మ్యాచింగ్ గ్రాంట్ గా అందచేయాలని విన్నవించారు. అదేవిధంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో అడ్వకేట్స్ ప్రోటెక్షన్ చట్టం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. పైన పేర్కొన్న న్యాయవాద సమస్యలను కేటీర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. యువ న్యాయవాదులకి 5000 rs stipend ఇవ్వాలని కోరారు. ఈ సంక్షేమ ఫలాలు సమాకురాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 100 కోట్ల రూపాయలు సరిపోవని, సుమారు 500 కోట్ల రూపాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేటీర్ గారు స్పందించి రానున్న అసెంబ్లీ సెషన్స్ లో ఈ అంశాలు లేవనేట్టుతా అని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు బిచ్చల తిరుమల రావు, మేకల సుగుణరావు, కొత్త వెంకటేశ్వరరావు అద్దంకి ప్రవీణ్, పిడతల రామ్మూర్తి, తన్నేరు లలిత, చేకూరి ముక్తాశ్వర రావు, పసుపులేటి శ్రీనివాస్ రావు, కన్నంబ, కళ్ళు మహేష్ రామానుజం నిరోసా ఉబ్బనపల్లి, మేకల సత్యనారాయణ, తెల్లకుల రామారావు, చుండూరు కోటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.