01-01-2006 తర్వాత ఎన్రోల్మెంట్ అయిన, 35 సంవత్సరాలు దాటినా న్యాయవాదులకి వెల్ఫేర్ ఫండ్ కాట్టుకొనుటకు అవకాశం కల్పించండి..
అలాగే 35 సంవత్సరాలలోపు ఎన్రోల్మెంట్ అయి వెల్ఫేర్ ఫండ్ కట్టుకొనటువంటి వారికీ కూడా అవకాశం కల్పించండి..
1-1-2006 తర్వాత enrollment చేసుకున్న 35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ లో అవకాశం కల్పించాలని కోరుతూ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డికి ఖమ్మం బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. 01-01-2006 ముందు ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకి 2018లో ఒకసారి అవకాశం కల్పించారని, అప్పుడు 1-1-2006 వరకు కటాఫ్ డేట్ నిర్ణయించడంతో చాలామంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. అదేవిధంగా 1-1-2006 తర్వాత 35 సంవత్సరాలు దాటి enrollment చేసుకున్న న్యాయవాదులకి కూడా ఒకసారి అవకాశం కల్పించాలని కోరామని తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ కట్టకపోడంతో కరోనా బారిన పడిన వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది బొర్రా లక్ష్మీ కనకవల్లి పాల్గొన్నారు.